నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.
రహదారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు కనిపిస్తాయి. ఒక్కోసారి వాటిని చూసి మనం షాక్ అవుతాం. తాజాగా బ్రెజిల్‌లో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డుపై అనకొండ దర్శనమిచ్చింది. దీంతో జనాలు ఆగమాగం అయ్యారు.
రహదారి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు కనిపిస్తాయి. ఒక్కోసారి వాటిని చూసి మనం షాక్ అవుతాం. తాజాగా బ్రెజిల్‌లో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డుపై అనకొండ దర్శనమిచ్చింది. దీంతో జనాలు ఆగమాగం అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో 10 అడుగుల ఎత్తున్న అనకొండ రద్దీగా ఉండే రోడ్డుపై హాయిగా పాకుతూ వెళుతుండటం మనం గమనించవచ్చు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు కంగారుగా వాహనాలను నిలిపివేసి ఆ అనకొండను చూస్తూ అలాగే ఉండిపోయారు. హైవే మధ్యలో ఉన్న అనకొండ డివైడర్ చుట్టూ పాకుతూ రోడ్డు అవతల ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ భారీ అనకొండను వాహనదారులు వింతగా చూస్తూ తమ సెల్‌ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బ్రెజిల్‌లోని అనేక మంది ప్రజలు అనకొండ కోసం రోడ్డు మార్గంలో తమ ప్రయాణాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. ఇప్పుడు ఈ వీడియో మిలియన్ల వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు అనకొండకు ఎటువంటి హాని చేయకుండా రోడ్డు దాటడానికి సహాయం చేసినందుకు బాటసారులను అభినందిస్తున్నారు. ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో ఒక యూజర్ ఇలా రాశాడు. “ఆ అందమైన పామును చంపనందుకు చాలా ధన్యవాదాలు”. పాము ఆహారం కోసం రోడ్డుపై తిరుగుతూ ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. అనకొండలు 550 పౌండ్లు, 29 అడుగుల కంటే ఎక్కువగా పెరుగుతాయి. అవి అమెజాన్, ఒరినోకో బేసిన్ లోని వర్షారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: ట్రాఫిక్ పోలీస్‌కి లంచంగా నడిరోడ్డుపై ముద్దు యువతి వీడియో వైరల్.. : Police Viral Video.