Tourist Places In Goa: గోవాలో ఈ ప్లేస్‌ను చూశారా..! చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఆ సీన్‌ తీసింది ఇక్కడే..!

|

Jul 25, 2022 | 8:56 PM

పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి.


పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. నురగలు కక్కుకుంటూ జలజలా జారుతూ పారే నీటిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే. గోవాలో ఉంది ఈ అద్భుత దూత్‌సాగర్‌ జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ రమేష్‌ పాండే వీడియోను షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. గోవా, కర్ణాటక సరిహద్దు మన్ డోవి నది పైన ఉంది ఈ దూద్ సాగర్ జలపాతం. ఈ జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల ప్రయాణించాలి. ఇక ఈ జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ లో ప్రయాణిస్తూ దూద్ సాగర్ వాటర్‌ఫాల్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఇక్కడే ఓ సీన్ ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 25, 2022 08:56 PM