నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం

|

Jan 09, 2024 | 9:35 PM

మీరు ఈత క‌ల్లు, తాటి క‌ల్లు రుచి చూసి ఉంటారు...కానీ అంతకు వేప క‌ల్లు టేస్ట్ తెలుసా మీకు.. ఎప్పుడైనా టేస్ట్ చేసారా.. ఏంటి సామీ.. వేప కల్లా... మా చెవిలో పూలు పెడుతున్నారా.. అనుకోకండి.. అవును ఇప్పుడు వేప క‌ల్లు కోసం అక్కడి జనం క్యూ కడుతున్నారు. వేపచెట్టునుంచి ఎవరూ గీయకుండానే కల్లు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరోవైపు ఈ కల్లు ఆరోగ్యానికి చాలా మంచిదంటూ దానిని ఓ పట్టుపట్టేందుకు జనం ఎగబడుతున్నారు.

మీరు ఈత క‌ల్లు, తాటి క‌ల్లు రుచి చూసి ఉంటారు…కానీ అంతకు వేప క‌ల్లు టేస్ట్ తెలుసా మీకు.. ఎప్పుడైనా టేస్ట్ చేసారా.. ఏంటి సామీ.. వేప కల్లా… మా చెవిలో పూలు పెడుతున్నారా.. అనుకోకండి.. అవును ఇప్పుడు వేప క‌ల్లు కోసం అక్కడి జనం క్యూ కడుతున్నారు. వేపచెట్టునుంచి ఎవరూ గీయకుండానే కల్లు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరోవైపు ఈ కల్లు ఆరోగ్యానికి చాలా మంచిదంటూ దానిని ఓ పట్టుపట్టేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ వింత ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కారేపల్లి గ్రామంలో గత వారం పది రోజుల నుండి వేప చెట్టుకు కల్లు కారుతోంది. అది చూసిన ఆ చెట్టు యజమాని భూమన్న చెట్టుకు బాటిల్ కట్టి వచ్చిన. వేప కల్లును సాక పట్టారు. అది తాగి చూసిన భూమన్న వేప చెట్టు కల్లు భలే టేస్టుగా ఉందంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయట స్థానికులకు తెలియడంతో జనం వేప చెట్టు కల్లు ను టేస్ట్‌ చేయడానికి భూమన్న ఇంటికి క్యూ కడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా

Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్