రెస్టారెంట్‌ను ధ్వంసం చేసి.. సిబ్బందిపై దాడులకు తెగబడ్డ మహిళలు

రెస్టారెంట్‌ను ధ్వంసం చేసి.. సిబ్బందిపై దాడులకు తెగబడ్డ మహిళలు

Phani CH

|

Updated on: Jul 14, 2022 | 6:09 PM

న్యూయార్క్‌లో ముగ్గురు మహిళలు ఒక రెస్టరెంట్‌ని దారుణంగా ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. చిన్న విషయానికే రెస్టారెంట్‌లోని వస్తువులను చిందరవందరగా పడేసి సిబ్బింది పై దాడి చేశారు.

న్యూయార్క్‌లో ముగ్గురు మహిళలు ఒక రెస్టరెంట్‌ని దారుణంగా ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. చిన్న విషయానికే రెస్టారెంట్‌లోని వస్తువులను చిందరవందరగా పడేసి సిబ్బింది పై దాడి చేశారు. ముందుగా వాళ్లు ఆ రెస్టారెంట్‌లో కావల్సిన ఫుడ్‌ని ఆర్డర్‌ చేసి తిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఫ్రై తినడానికి మరికొంత సాస్‌ వడ్డించమని అడిగారు. సదరు రెస్టారెంట్‌ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు మహిళలు రెస్టారెంట్‌లోని వస్తువులను నాశనం చేసి…కౌంటర్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది పై కూడా దాడి చేశారు. వాస్తవానికి వారు వడ్డించమన్న సాస్‌ సుమారు 10 వేల రూపాయలు ధర పలుకుతుందని సిబ్బంది చెబుతున్నారు. అందువల్ల అదనంగా వడ్డించడం కుదరదని చెబుతున్నాడు రెస్టారెంట్‌ ఉద్యోగి. ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ మేరకే ఆ సాస్‌ వడ్డించడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఐతే ఆ మహిళలు సృష్టించిన వీరంగానికి సిబ్బంది తిరిగి విధుల్లోకి రావడానికి భయపడ్డారు. ఐతే న్యూయార్క్‌ పోలీసులు ఆ ముగ్గుర మహిళలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగవైరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోలో అంత మంది ప్రయాణికులా !! ఎలా ఎక్కించావురా నాయనా అంటూ ఆశ్చర్య పోతున్న పోలీసులు

తాబేలుపై ఎలుక స్వారీ.. చిన్ని ప్రాణుల స్నేహానికి నెటిజన్లు ఫిదా

పక్షులతో పోటీపడుతున్న కోళ్లు !! రయ్‌ రయ్‌మంటూ రెక్క విప్పుకుని..

డ్రైవ్ చేస్తూ తినాలని ఉందా ?? అయితే ఈ డైనింగ్‌ టేబుల్‌ మీ కోసమే.. మీరు ఎక్కడికి వెళ్తే అది అక్కడికే !!

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!

 

Published on: Jul 14, 2022 06:09 PM