ఆటోలో అంత మంది ప్రయాణికులా !! ఎలా ఎక్కించావురా నాయనా అంటూ ఆశ్చర్య పోతున్న పోలీసులు
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై గరిష్టంగా ఇద్దరు వ్యక్తులు, ఆటోలో గరిష్టంగా నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. అయితే ఈ నిబంధనలను మనం పుస్తకాలలో మాత్రమే చూస్తున్నాం..
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్‌పై గరిష్టంగా ఇద్దరు వ్యక్తులు, ఆటోలో గరిష్టంగా నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. అయితే ఈ నిబంధనలను మనం పుస్తకాలలో మాత్రమే చూస్తున్నాం.. ఎందుకంటే ఎక్కడ ఏ వాహనదారులను చూసినా ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించేవారు బహు అరుదుగా కనిపిస్తారు. ఇక తాజాగా ఓ చిన్న ఆటోలో భారీ మొత్తంలో ప్యాసింజర్లను ఎక్కించుకుని తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఆటోలో డ్రైవర్ 26 మంది కూర్చోబెట్టుకుని ఆటో నడుపుతున్నాడు. పోలీసులు ఈ ఆటోను పట్టుకున్నప్పుడు.. ఆటోలోని ప్రయాణీకులను చూసి ఆశ్చర్యపోయారు. డ్రైవర్‌తో సహా 27 మంది అందులో ఉన్నారు. వారందరూ బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేయడానికి ఇంటి నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీన్‌పై పలువురు నెటిజన్స్ నానా కామెంట్స్‌తో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాబేలుపై ఎలుక స్వారీ.. చిన్ని ప్రాణుల స్నేహానికి నెటిజన్లు ఫిదా
పక్షులతో పోటీపడుతున్న కోళ్లు !! రయ్ రయ్‌మంటూ రెక్క విప్పుకుని..
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!
ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్ అయ్యావో సీన్ సితారే..