Girls stuck in society lift: లిఫ్ట్‌లో ఇరుక్కున్న ముగ్గురు చిన్నారులు..! అరగంట సేపు నరకం అనుభవించిన పిల్లలు..
ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 20 అంతస్తుల అసోటెక్ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు
ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 20 అంతస్తుల అసోటెక్ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు అరగంట పాటు అందులోనే ఉండిపోయి నరకం అనుభవించారు. లిఫ్ట్ నుంచి ఎలా బయటపడాలో తెలియక అల్లాడిపోయారు ముగ్గురు అమ్మాయిలు. లిఫ్ట్ బటన్లు పనిచేయకపోవడంతో పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్‌షిప్‌లోని అసోటెక్ ది నెస్ట్‌లో నవంబర్ 29న ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఉండగా సడెన్ ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారులు ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. దీంతో సాయం కోసం చిన్నారులు గట్టిగా అరిచారు. అయితే ఫలితం లేకుండా పోయింది. చివరికి పిల్లల ఆర్తనాదాలు విన్న స్థానికులు ముగ్గురిని రక్షించారు. ఈ ఘటనలో బిల్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లిఫ్ట్ రిపేర్ చేయాలని బిల్డర్‌కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపించారు. కాగా, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

