దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త

|

Oct 19, 2024 | 2:02 PM

సిటీ జనాలనే బురిడీ కొట్టించే డైవర్షన్‌ దొంగలకు ఇక ఊరి జనాలు ఓ లెక్కనా? అప్పుడే డబ్బు సంచితో బ్యాంక్‌ నుంచి బయటపడ్డ ఓ వ్యక్తికి కుచ్చుటోపీ వేశారు దొంగలు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో జరిగిన ఘరానా మోసం ఇది. పెండ్లి మల్లయ్య అనే వ్యక్తి సింగరాజుపల్లి గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకు నుండి 40 వేల రూపాయలు విత్ డ్రా చేసుకుని బయటికి వచ్చాడు.

తన టీవీఎస్ ఎక్సెల్ బైక్ లో డబ్బులు పెట్టుకొని సింగరాజుపల్లి నుండి తన ఇంటికి వెళ్తుండగా దొంగల కంటిలో పడ్డాడు. ఇంకేముంది.. మైండ్‌ డైవర్షన్‌ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సీతారాంపురం గ్రామ సమీపంలో మల్లయ్య బండిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. మీ డబ్బులు కింద పడిపోయాయి చూసుకోండి అని నమ్మబలికారు. దొంగల మాటలు నమ్మిన మల్లయ్య తన బండి దిగి కిందపడి ఉన్న కొన్ని డబ్బులు తీసుకుంటుండగా అతని బైక్ లో ఉన్న 40 వేల రూపాయలు అపహరించి ఎత్తుకెళ్లారు. దొంగలు లబో దిబో మంటూ మల్లయ్య పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదుతో దేవరుప్పుల పోలీసులు, పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అపరిచిత వ్యక్తులను నమ్మొద్దని సిఐ మహేందర్ రెడ్డి ఎస్ ఐ.సృజన కుమార్ సూచించారు. నిందితులు ఇద్దరు హీరో హోండా ఓ స్ల్పెండర్ ప్లస్ బైక్ పై వచ్చినట్లు పక్కనే ఉన్న ఓ షాప్ సీసీ కెమెరాలలో రికార్డు అయింది. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??

మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే !!

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ

వామ్మో.. ఏంటా ఆవేశం.. కారును తుక్కు తుక్కు చేసిన ఏనుగు.. చివరకు ??

Follow us on