Thief Sleeps: దొంగతనానికి వెళ్లి గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ.. ఆ తరువాత సీన్ అదుర్స్.!

|

Nov 24, 2023 | 9:45 AM

దొంగతనానికి వెళ్లే దొంగలు దొరికిపోకూడదని బోలెడు ప్లాన్లు వేసుకుంటారు. కంటిమీద కునుకు రాకుండా సమయం కోసం చూస్తుంటారు. కానీ ఓ దొంగ ఇంటికి దొంగతనానికి వెళ్లి.. హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. చైనాలో జరిగిన ఈ సరదా ఘటనలో తర్వాత ఏమైందంటే..? స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఒక ఇంట్లో దోచుకునేందుకు ఓ దొంగ ప్లాన్‌ వేశాడు. దాని ప్రకారమే రాత్రి ఆ ఇంటికి చేరుకున్నాడు.

దొంగతనానికి వెళ్లే దొంగలు దొరికిపోకూడదని బోలెడు ప్లాన్లు వేసుకుంటారు. కంటిమీద కునుకు రాకుండా సమయం కోసం చూస్తుంటారు. కానీ ఓ దొంగ ఇంటికి దొంగతనానికి వెళ్లి.. హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. చైనాలో జరిగిన ఈ సరదా ఘటనలో తర్వాత ఏమైందంటే..? స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఒక ఇంట్లో దోచుకునేందుకు ఓ దొంగ ప్లాన్‌ వేశాడు. దాని ప్రకారమే రాత్రి ఆ ఇంటికి చేరుకున్నాడు. కానీ అతడు వెళ్లేసరికి ఇంట్లో ఇంకా ఎవరూ నిద్రపోలేదు. వారు నిద్రపోయేవరకు ఆ ఇంటిలోని ఒక గదిలోనే సిగరెట్‌ తాగుతూ వెయిట్‌ చేసాడు. అక్కడితో ఆగితే.. తెల్లారేలోపు అతడికి మెలకువ వచ్చుంటే ఇల్లు దోచుకోవడమే లేక ఎవరికంటా పడకుండా జారుకోవడమో జరిగేది. కానీ అతడు మాత్రం ఒళ్లు మర్చిపోయి.. హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. ఆ గురక దెబ్బకు ఇంట్లో ఓ మహిళకు మెలకువ వచ్చింది. ఆ శబ్దం పక్కింట్లో నుంచి వచ్చి ఉంటుందిలే అని పట్టించుకోలేదు. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ ఆ గురక శబ్దం ఎక్కువ కావడంతో ఆమెకు అనుమానం మొదలైంది. ఇంట్లోనే ఎవరో ఉన్నారని గదులన్నీ వెతగ్గా.. నిద్రావస్థలో ఉన్న ఈ దొంగ దర్శనమిచ్చాడు. దాంతో ఆమె వెంటనే ఇంట్లోని వారిని లేపి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ వెంటనే పోలీసులు వచ్చి, అతడిని నిద్రలేపి, అరెస్టు చేశారు. ఆ దొంగకు నేర చరిత్ర ఉందని, ఒక కేసులో జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడన్నారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో సోషల్‌ మీడియా వీబోలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అతడు అలసిపోయాడని కొందరు… ఓవర్‌టైమ్ పనిచేయకుండా ఉండాల్సింది అని ఇంకొందరు అతడు ఇంట్లోకి దూరాడు. కానీ దొంగతనం చేయలేదు. దీనికి శిక్ష ఏంటో..? అని పోస్టులు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.