Car Stole: అమ్మదినమ్మ బత్తాయో.. ఇదేం వయ్యారం..? లిఫ్ట్ ఇచ్చిన కార్ నే కొట్టేసారు గా.. వీడియో.

|

Dec 03, 2022 | 7:52 PM

ఢిల్లీలో నలుగురు కేటుగాళ్లు బరి తెగించారు. లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి కారునే కొట్టేశారు. అతడి కళ్లలో కారం కొట్టి, బలవంతంగా కారు ఎత్తుకుపోయారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..


నోయిడాలోని సెక్టార్‌-93లో ఉండే ఓ వ్యక్తి ఢిల్లీలో పని చేస్తున్నాడు. గత బుధవారం కారులో వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు ఆపి లిఫ్ట్‌ అడిగారు. తాము కూడా ఢిల్లీకే వెళ్తున్నామని చెప్పారు. ఛార్జీలు చెల్లించాలని మాట్లాడుకుని వారిని ఆ వ్యక్తి కారులోకి ఎక్కించుకున్నాడు. అయితే కొద్ది దూరం వెళ్లేసరికి ఆ నలుగురూ కారు యజమాని కళ్లలో కారం కొట్టి కారును గురుగ్రామ్‌, హరియానా వైపు మళ్లించారు. మధ్యలో కారు యజమానిని బలవంతంగా కిందకు తోసేసి కారును ఎత్తుకుపోయినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై నోయిడా సెక్టార్‌ 20 పోలీస్‌స్టేషన్‌లో సెప్టెంబరు 23న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఫేజ్‌ 2 పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితులు ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నాం అని సెంట్రల్‌ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మీడియాకు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 03, 2022 07:52 PM