గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ఈ గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే ఈ గ్రీన్ టీ పరిమితికి మించి తాగితే ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకుందాం. గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సహా అనేక చికాకులు వస్తాయి.
మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి దానిని తక్కువగా తీసుకోవాలి. గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి దంత సమస్యలను కలిగిస్తాయి. అంతే కాదు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు మొదటగా రంగు మారి, తరువాత క్రమంగా బలహీన పడిపోతాయి.శరీరానికి కావాల్సిన పోషకాల్లో అతి ముఖ్యమైనది ఐరన్ . అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగటం వల్ల శరీరం ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరం ఐరన్‌ని గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే పరగడుపున కాకుండా, ఆహారంతోపాటే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
