చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మామూలోళ్లు కాదు. అన్నంత పని చేసేశారు. ఒకేసారి మూడు దేశాలపై టారీఫ్ ను వేసి అందరీకి షాకిచ్చారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధించారు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తాజా నిర్ణయంతో అగ్రరాజ్య ఆర్థిక వృద్ధి పెరుగుదలపై దృష్టి పెట్టారు.
తాజాగా చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే పార్శిళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది అమెరికా పోస్టల్ సర్వీస్. ముందునుంచీ హెచ్చరిస్తున్నట్టుగానే ట్రంప్ తమ పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలతోపాటు చైనా పైనా సుంకాల కొరడా ఝళిపించారు. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇతర దేశాలను సుంకాల పేరుతో ప్రతిసారీ బెదిరించకుండా, ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10 శాతం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
