Maharastra: ఊరు పై పగబట్టిన పాములు.. వేలల్లో పాము కాటు కేసులు నమోదు..
ఆ ఊళ్ళో పాముకాటు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 17 నెలల్లోనే మొత్తం వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అందులో 14 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా పాముకాటు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో 2022 జనవరి 1 నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు మొత్తం 1118 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని అలీబాగ్, పన్వేల్, ఖలాపుర్, మహాద్, మంగవూన్ తాలూకాల్లో ఇవి ఎక్కువగా నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే పాముకాటుకు గురైన వ్యక్తులు నిర్లక్ష్యం చేయొద్దని స్థానిక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. పాముకాటుకు గురైన వెంటనే మంత్రాలు, నాటు వైద్యం పేరుతో నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లాలని అధికారులు సూచించారు. జిల్లాలో 14 ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పాముకాటు చికిత్స అందుబాటులో ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!