Tribals: పాపం.. విషాదంలోనూ కన్నీరుకే కంటతడి పెట్టించింది..! గిరిజనుల కష్టాలు..

|

Sep 25, 2023 | 9:51 AM

తరాలు మారుతున్న తలరాతలు మారడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. సాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతున్నాయి.. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం.. ఆఖరికి చంద్రుడిపై కాలు కూడా మోపాం. కానీ ఆ అడవి బిడ్డల జీవితాలు మాత్రం మారడం లేదు. టెక్నాలజీ మాట దేవుడెరుగు.. కనీస మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

తరాలు మారుతున్న తలరాతలు మారడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి.. టెక్నాలజీ పెరుగుతోంది.. సాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతున్నాయి.. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం.. ఆఖరికి చంద్రుడిపై కాలు కూడా మోపాం. కానీ ఆ అడవి బిడ్డల జీవితాలు మాత్రం మారడం లేదు. టెక్నాలజీ మాట దేవుడెరుగు.. కనీస మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. చినుకు పడితే చాలు.. గిరిపుత్రులకు దిక్కుతోచని స్థితి. అత్యవసర వైద్య సేవలకైనా.. మృతదేహాన్ని తరలించడానికైనా.. రోడ్లు లేక వారి అవస్థలు వర్ణనాతీతం. వాగులో గడ్డలు దాటుకుంటూ డోలి కట్టి కిలోమీటర్ల ప్రయాణం ఆ అడవి బిడ్డలకు నిత్యకృత్యంగా మారింది. తాజాగా.. ఓ ఘటన స్థానిక గ్రామ సర్పంచ్‌కే ఎదురైంది. తీవ్ర విషాదంలోనూ కన్నీరుకే కంటతడి పెట్టించింది. అల్లూరి జిల్లాలో గిరిజనులకు డోలి కష్టాలు అన్ని ఇన్ని కావు. అసలే అంతంత మాత్రాన ఉండే ఆ రహరులు.. ఆపై వర్షం పడితే వారి కష్టాలు వర్ణనాతీతం. తాజాగా స్వయాన సర్పంచికే ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. అనారోగ్యంతో కొడుకు చనిపోతే.. ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి తరలించేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పెదబయలు మం జామిగూడలో ఘటన జరిగింది. అనారోగ్యంతో సర్పంచ్ అనెమ్మ కొడుకు చంద్ర కిరణ్ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం గ్రామానికి తరలిస్తుండగా గుంజువాడ వద్ద వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తుంది వాగు. రహదారి లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు నుంచి మృతదేహం తరలించ్చారు. ఇప్పటికైనా తమ కష్టాలు చూసి.. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు గిరిజనులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..