Viral: మంచి మనసు చాటుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌.. ఏం చేశాడంటే..?

|

Mar 27, 2023 | 9:44 AM

పోలీసులు అంటేనే కఠినమైన మససు కలవాళ్లని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవల, మాకూ మనసుంది.. దానికి చలించే గుణం ఉందంటూ నిరూపించే అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో..

వైరల్‌ అవుతున్న ఈ వీడియో రాజస్థాన్‌కు చెందినది. ఇందులో జైపూర్‌లోని ఓ రోడ్డు చాలా రద్దీగా ఉంది. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభానికి చిక్కుకుని వేలాడుతూ కనిపించింది ఓ పావురం. దాని కాలికి మాంజా చిక్కుకుని ఉండటంతో ఆ మాంజా పావురం ఎగురుతున్న సమయంలో స్తంభానికి చుట్టుకొని పక్షి వేలాడుతూ ఉండిపోయింది. కొందరు అది చూసి అయ్యో అని వెళ్లిపోయారేకానీ దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. దాంతో అదే సమయంలో ఓ ట్రాఫిక్ పోలీస్ అక్కడికి వచ్చారు. పైన వేలాడుతున్న పావురాన్ని చూసి, దాన్ని ఎలాగైనా కాపాడాలలనుకున్నాడు. ఇంతో అటుగా ఓ ఆర్మీ కోచింగ్ సెంటర్ బస్ వెళ్తూ కనిపించింది. వెంటనే బస్సును ఆపి ఆ బస్సు మీదకు ఎక్కి పావురాన్ని ట్రాఫిక్ సిగ్నల్ స్తంబం నుండి వేరుచేశాడు. స్థానికుడి సహాయంతో పావురం కాళ్లకు ఉన్న మాంజా తొలగించి పావురాన్ని కాపాడి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఈసంఘటన మొత్తాన్ని వీడియో తీసారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇలాంటి మంచి పోలీసులు ఉండబట్టే ప్రజలు, మూగజీవులు కాస్తయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటూ ప్రశంసల కామెంట్స్ చేశారు. గాలిపటాల మంజా కారణంగా ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని వాటిని వాడటం రద్దు చెయ్యాలని కొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 27, 2023 09:44 AM