Monkey Viral Video: దీని దుంప తెగ ఈ కోతిది ఎమన్నా తెలివా..? చోరీల్లో ప్రొఫెషనల్స్‌ని మించిపోయిందిగా…వీడియో

|

Mar 11, 2022 | 8:47 AM

అల్లరి చేష్టలకు పెట్టింది పేరు కోతులు. అందుకే మనం కూడా ఎవరైనా అల్లరి చేసినప్పుడు కోతివేషాలు వెయ్యకు అంటుంటాం. మనం గుడికో, పర్యాటక ప్రదేశాలకో వెళ్లినప్పుడు అక్కడ గుంపులుగా కోతులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి కొందరు వాటికి తినడానికి పండ్లు అవీ పెడతారు.


అల్లరి చేష్టలకు పెట్టింది పేరు కోతులు. అందుకే మనం కూడా ఎవరైనా అల్లరి చేసినప్పుడు కోతివేషాలు వెయ్యకు అంటుంటాం. మనం గుడికో, పర్యాటక ప్రదేశాలకో వెళ్లినప్పుడు అక్కడ గుంపులుగా కోతులు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి కొందరు వాటికి తినడానికి పండ్లు అవీ పెడతారు. అయినా అవి వాటి చేష్టలు మానవు… పర్యాటకుల చేతిలో ఏదైనా కనిపించిందా అది ఎత్తుకుపోయేవరకూ ఊరుకోవు. అయితే ఇక్కడ ఒక కోతి… కళ్లజోళ్లను మాత్రమే ఎత్తుకుపోతూ ఆశ్చర్యపరుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్… సిమ్లాలోని రిడ్జ్ మాల్ రోడ్ పర్యాటక ప్రదేశంలో… ఓ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అది అక్కడి ఆలయాల దర్శనం కోసం వచ్చే భక్తులను గమనిస్తూ ఉంది. అంతలో అటుగా ఓ మహిళ కళ్లజోడు ధరించి రావడాన్ని చూసింది. సరైన టైమ్ చూసి… ఆమె కళ్లజోడును కొట్టేసిన కోతి… దాన్ని నోట కరచుకొని… వెంటనే ఓ షెడ్డు పైకి ఎక్కి… ఎత్తైన ప్రదేశంలో మరో కోతి పక్కన కూర్చుంది. ఆ కళ్లజోడు తిరిగి ఇవ్వాలంటే ఆ కోతికి ఏదైనా ఆహారం ఇవ్వాలి. అప్పుడే అది కళ్లజోడు తిరిగిస్తుంది. ఈ విషయం తెలిసిన ఓ పర్యాటకుడు… ప్రసాదం పొట్లాన్ని కోతికి ఇవ్వగానే… అది కళ్లజోడును తిరిగి ఇచ్చింది. దాన్ని తీసుకొని అతను.. ఆమెకు ఇచ్చాడు. ఈ కోతి ఇలా తరచూ చేస్తూనే ఉంటుంది. దీనికి ఇలా ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా లేక అదే నేర్చుకుందా అన్నది తెలియదుకానీ… ఈ వానరం పాపం ఆహారం కోసమే ఇలా పర్యాటకుల్ని ఇబ్బంది పెడుతోంది. టూరిస్టులు కూడా అది మూగజీవి అన్న కారణంతో దాన్ని ఏమీ అనకుండా… దానికి ఆహారం ఇచ్చి తమ వస్తువులు వెనక్కి తీసుకుంటున్నారు. ట్విట్టర్‌ ఎకౌంట్‌లో పోస్ట్‌చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “వావ్… ఆ కోతి ఎంత దర్జాగా చేస్తోంది చోరీ” అని ఓ యూజర్ చెప్పగా… “31 సెకండ్ల దగ్గర ఆ కోతి చాలా తెలివిగా చోరీ చేసింది” అని మరో యూజర్ స్పందించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..