Lottery Winner: లాటరీలో కోట్లు గెలుచుకున్న వ్యక్తి..! ఇన్ని కోట్లు నాకొద్దు బాబోయ్‌ అంటూ ఆవేదన..(వీడియో)

Lottery Winner: లాటరీలో కోట్లు గెలుచుకున్న వ్యక్తి..! ఇన్ని కోట్లు నాకొద్దు బాబోయ్‌ అంటూ ఆవేదన..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 02, 2022 | 9:24 AM

లాటరీలో కోట్లు గెలుచుకుని అదృష్టవంతుడిగా మారిన కేరళకు చెందిన ఆటోడ్రైవర్‌ అనూప్‌.. ఇప్పుడు ఆ డబ్బు నాకొద్దు బాబోయ్‌ అంటున్నాడు. అదేంటి లక్కీగా లచ్చిందేవి కోట్లు కురిపిస్తే


లాటరీలో కోట్లు గెలుచుకుని అదృష్టవంతుడిగా మారిన కేరళకు చెందిన ఆటోడ్రైవర్‌ అనూప్‌.. ఇప్పుడు ఆ డబ్బు నాకొద్దు బాబోయ్‌ అంటున్నాడు. అదేంటి లక్కీగా లచ్చిందేవి కోట్లు కురిపిస్తే పండగ చేసుకోవాలికానీ ఇలా వద్దంటారా అనుకుంటున్నారా… ఉంటారండి బాబు… ఇలాంటివాళ్లు కూడా ఉంటారు.. అయితే ఇన్ని కోట్లు వద్దనుకోడానికి అతని ఇబ్బందేంటో చూద్దాం..

ఆటో డ్రైవ‌ర్ అనూప్ 25 కోట్ల రూపాయలను గెలుచుకున్నా.. ప‌న్ను, ఇతర బకాయిలు అన్ని మిన‌హాయింపులు తర్వాత ప్రైజ్ మనీగా 15 కోట్లు పొందుతాడు. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండడంతో తాను ఇప్పుడు మ‌న‌శ్శాంతిని కోల్పొయాన‌ని చెపుతున్నాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బులు రానుండడంతో తాను మ‌న‌శ్శాంతిని కోల్పొయాన‌ని, కనీసం తన ఇంట్లో తాను నివసించే పరిస్థితి లేదని వాపోతున్నాడు. ఎందుకంటే తాను లాటరీలో కోట్లు గెల్చుకున్నానని తెలిసినప్పటినుంచి తమ అవసరాలను తీర్చమంటూ కోరుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయిందంటున్నాడు. మొదట్లో తనకు బహుమతి వచ్చినందుకు సంతోషంగానే ఉంది.. అయితే ఇప్పుడు తనకు బహుమతి వద్దనిపిస్తుందని అన్నాడు. కాగా తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడానికి ప్రయత్నించాడు. తాను ఆ డబ్బును ఏమి చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. రెండు ఏళ్ళు బ్యాంక్ లో వేస్తానని చెప్పాడు. డబ్బులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అనూప్ తన భార్య, బిడ్డ తల్లితో కలిసి కేరళ రాజధానికి 12 కిలోమీటర్ల దూరంలోని శ్రీకారియమ్‌లో నివసిస్తున్నాడు. అనూప్ స్థానిక ఏజెంట్ నుండి లాటరీ టికెట్ ను కొనుగోలు చేశాడు. ఇటీవల ఆ లాటరీ టికెట్ కు మొదటి బహుమతి లభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 02, 2022 09:24 AM