తమిళనాడు ఇంటి పునాది తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శ్రీ వారి భారీ విగ్రహం..:Lord Venkateswara Idol video.
The Oldest Venkateswara Swamy Idol Found In Tamil Nadu Video

తమిళనాడు ఇంటి పునాది తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శ్రీ వారి భారీ విగ్రహం..:Lord Venkateswara Idol video.

|

Jun 23, 2021 | 8:37 AM

Lord Venkateswara Idol: తమిళనాడు రాష్ట్రంలో అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహం బయల్పడింది.


Lord Venkateswara Idol: తమిళనాడు రాష్ట్రంలో అతి పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది. అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహం బయల్పడింది. కారయంకురిచి గ్రామానికి చెందిన శరవణన్ తనకు చెందిన స్థంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపించాడు. ఈ క్రమంలో రాతి విగ్రహం తగిలినట్లుగా కనిపించడంతో జాగ్రత్తంగా తవ్వకాలు జరిపారు. పూర్తిగా తవ్వి చూడగా.. సుమారు ఎనిమిది అడుగుల స్వామివారి రాతి విగ్రహం కనిపించింది. దాంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు జేసీబీని రప్పించి.. జేసీబీ సహాయంతో విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు. గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచి.. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, స్వామి వారి పురాతన విగ్రహాన్ని అధికారులు తిరుచ్చిలోని పురావస్తు శాఖ కార్యాలయానికి తరలించడానికి ప్రయత్నించగా.. గ్రామస్తులు నిరాకరించారు. విగ్రహాన్ని తరలించేందుకు అంగీకరించలేదు. సీనియర్ అధికారులు ఎంటరై.. గ్రామస్తులతో చర్చలు జరిపించారు. విగ్రహం తరలింపునకు గ్రామస్తులను ఒప్పించారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని అధికారులు తరలించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కుక్క దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంతకీ కుక్క ఖరీదు రూ. ఆరు లక్షలు :Dog murder case video .

 నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .