Brother: ఈ చిన్నారి చేసిన పనికి ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు.. ఏం చేశాడంటే.. (వీడియో)
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్‌గా అనిపిస్తే.. కొన్ని ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. తాజాగా ఓ అద్భుతమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఎమోషనల్‌గా అనిపిస్తే.. కొన్ని ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. తాజాగా ఓ అద్భుతమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇలాంటి సన్ని వేశాలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. కానీ రియల్‌గా చూసి ఉండం. ఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో ముచ్చటపడిపోతున్నారు. ఈ వీడియోలో ఓ చిన్నారి తన చెల్లి, తమ్ముడికోసం ఏం చేశాడో చూస్తే మీరూ ఫిదా అయిపోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు ఒక దారిలో తమ ఇంటి వైపు వెళ్తున్నారు. అయితే ఇంటికి వెళ్లే దారిలో నీళ్ళు నిండి ప్రవహిస్తోంది. దాంతో ముగ్గురూ రోడ్డుమీద ఆగిపోయారు.. అయితే అన్నయ్య ముందుగా తన చెల్లిని వీపుమీద ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.. ఇంటి మెట్ల దగ్గర సేఫ్ గా దింపాడు. మళ్ళీ వెనక్కి వచ్చి.. తన వీపు పై తమ్ముడిని ఎక్కించుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ తీసుకుని వెళ్లి.. ఇంటి మెట్ల దగ్గర దింపాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అన్నదమ్ములంటే ఇలాగే ఉంటారు.. తల్లిదండ్రులు తమ విలువలతో కూడిన అపూర్వమైన వజ్రాన్ని చెక్కారని కామెంట్ జతచేశారు. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

