squirrel viral video: ఉడత సాయం కాదు.. ఉడుతకు సాయం.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో…
సాయం చేయడం మనుషుల్లో ఉన్న గొప్ప గుణం. ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికి సాయం చేస్తూ ఉంటారు.
సాయం చేయడం మనుషుల్లో ఉన్న గొప్ప గుణం. ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికి సాయం చేస్తూ ఉంటారు. తోటి మనుషులకే కాదు జంతువులకు కూడా సాయం చేస్తుంటారు కొందరు. జంతుప్రేమికులు మనుషులకన్నా జంతువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. జంతుజీవుల సంరక్షణ కోసం ఎదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు కొందరు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న ఉడతలకు నీరు తాగిస్తున్నాడు. వాటికి ఆహారం పెడుతున్నాడు. అక్కడే ఉన్న మరో ఉడతతో మాట్లాడుతూ కెమెరా వైపు చూడమని చెప్పాడు. అయితే ఆది అతడి దగ్గరకు వెళ్లి… కెమెరా తర్వాత.. నాకు ఆకలేస్తుంది… అన్నట్టుగా అతడివైపు చూస్తూ నిలుచుంది. వెంటనే అతడు దానికి గింజలను అందించాడు. ఓ వైపు ఒక ఉడతకు నీరు తాగిస్తూ.. మరో ఉడతకు ఆహారం అందించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీడియో హృదయానికి హత్తుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
