Bharti Singh Video: ప్రెగ్నెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లాఫింగ్ క్వీన్.. నెట్టింట వీడియో వైరల్..
బుల్లితెరపై ఓ ప్రముఖ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భారతీ సింగ్ . ఆ షోలో లల్లీ అనే పాత్రతో నవ్వులు పూయించారామె. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉంటోన్న ఈ అందాల తార త్వరలోనే తల్లిగా కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమికుడు
బుల్లితెరపై ఓ ప్రముఖ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భారతీ సింగ్ . ఆ షోలో లల్లీ అనే పాత్రతో నవ్వులు పూయించారామె. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉంటోన్న ఈ అందాల తార త్వరలోనే తల్లిగా కొత్త ప్రయాణం ప్రారంభించనుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమికుడు హర్ష్ లింబాచియాతో ఏడడుగులు నడిచిన ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. హోలీ పండగను పురస్కరించుకుని ఆమె ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసారు. ఇక గతంలో ఎంతో బొద్దుగా ఉన్న భారతీ సింగ్.. పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. దాంతో బరువు తగ్గి నాజుకుగా మారిపోయారు. కాగా ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న ఆమె, తన ప్రెగ్నెన్సీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను గర్భం ధరించిన రెండు నెలల తర్వాత కానీ ఆ విషయం తెలుసుకోలేకపోయానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.తాను గర్భవతి అయినప్పుడు, రెండున్నర నెలల వరకు ఆ విషయాన్ని గుర్తించలేకపోయానని, ఇంట్లో రోజువారి కార్యకలాపాలను చేసుకుంటూనే సినిమా షూటింగ్‌లకు హజరయ్యేదానినని చెప్పారు. డాన్స్ షోలో డ్యాన్స్ కూడా చేశానని, రన్నింగ్ కూడా చేసానని, రోజూ తినే ఆహారమే తీసుకున్నానని, ఇలా సుమారు రెండున్నర నెలలు పాటు తాను గర్భవతిని అనే విషయాన్నే గ్రహించలేకపోయానని తెలిపారు. ఈ క్రమంలో ఓ రోజు అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని రావడంతో… అప్పుడే తాను గర్భంతో ఉన్నానని తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని హర్ష్‌కు చెప్పగా.. ఆయన ఎంతో హ్యాపీగా ఫీలయ్యారని చెప్పారు. “త్వరలోనే మా తొలిబిడ్డను కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం. నార్మల్ డెలివరీ జరగాలనే కోరుకుంటున్నాను. ఇందుకోసం డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు రోజూ యోగా, తేలికపాటి ఎక్సర్ సైజులు చేస్తున్నాను. అలాగే దాదాపు అరగంట పాటు వాకింగ్ చేస్తున్నాను” అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకొచ్చారు ఈ కామెడీ క్వీన్.
మరిన్ని చూడండి ఇక్కడ:
Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..
Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!