Girl lottery: తండ్రితో గొడవపడి మరీ లాటరీ టిక్కెట్ కొన్న బాలిక.. అదృష్టం కలిసొచ్చి ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే షాకే.!

|

Jul 16, 2022 | 7:07 PM

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో.. అనడానికి ప్రతక్ష్య ఉదాహరణగా నిలిచింది ఓ ఉదంతం. అమృత్‌సర్‌లో రోడ్డుపై చిన్నపాటి బండిపై వ్యాపారం


అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో.. అనడానికి ప్రతక్ష్య ఉదాహరణగా నిలిచింది ఓ ఉదంతం. అమృత్‌సర్‌లో రోడ్డుపై చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కుమార్తె ఇటీవల వంద రూపాయలు పెట్టి లాటరీ టికెట్‌ కొనుగోలు చేసింది. ఏదో అలా కొంటే.. చివరికి ఆమెకు 10 లక్షల విలువైన లాటరీ సొంతమైంది. తమ బిడ్డ వంద రూపాయల టికెట్‌తో 10 లక్షలు గెలుచుకోవడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.అమృత్‌సర్‌లోని బాబా బకాలా సాహిబ్‌కు చెందిన జమాల్‌ సింగ్‌.. తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో అతని కుమార్తె హర్‌సిమ్రన్‌ కౌర్‌.. తండ్రికి సాయం చేసేందుకు దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి షాప్‌కు వచ్చాడు. టికెట్‌ కేవలం వంద రూపాయలు అని, ఒకటి కొనుగోలు చేయండి అంటూ కోరాడు. జమాల్‌ సింగ్ అందుకు నిరాకరించాడు.ఈ సమయంలో అతని కుమార్తె హర్‌సిమ్రన్‌ కౌర్‌..తండ్రిని ఒప్పించి మరీ కొనుగోలు చేసింది. అయితే.. బుధవారం జరిగిన లాటరీ డ్రాలో ఆ యువతి 10 లక్షలు గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జమాల్‌ సింగ్‌ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రూ.10 లక్షలు గెలుచుకున్న సందర్భంగా కౌర్ మాట్లాడుతూ.. తాను ఈ ప్రైజ్ మనీని విద్య కోసం, తన తండ్రికి సహాయం చేసేందుకు ఉపయోగిస్తానని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 16, 2022 06:55 PM