Viral: మద్యం మత్తులో రైల్వే గేట్ ఓపెన్ చేయడం మర్చిపోయిన గేట్ మ్యాన్.. వీడియో వైరల్.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో కొట్టు ప్రకాశ్‌రావు అనే వ్యక్తి రైల్వే గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అతను మద్యం సేవించి విధులకు హాజరు కావడంతో మత్తులో మునిగిపోయిన అతను గేటు ఆపరేటింగ్ చేయలేకపోయాడు. ఎంతకీ రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో గేటుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పైగా అర్ధరాత్రి కావడంతో గంటపాటు ఎదురు చూసి చూసి గేటు తెరుచుకోకపోవడంతో
మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు ఓ రైల్వే గేట్ మ్యాన్. పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయిన అతను గేట్ ఆపరేటింగ్ చేయలేపోయాడు. దాంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షంలో కొట్టు ప్రకాశ్‌రావు అనే వ్యక్తి రైల్వే గేట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అతను మద్యం సేవించి విధులకు హాజరు కావడంతో మత్తులో మునిగిపోయిన అతను గేటు ఆపరేటింగ్ చేయలేకపోయాడు. ఎంతకీ రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో గేటుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పైగా అర్ధరాత్రి కావడంతో గంటపాటు ఎదురు చూసి చూసి గేటు తెరుచుకోకపోవడంతో కొందరు గేటు కిందనుంచి దూరి వెళ్లారు. కొందరు సదరు గేట్‌మ్యాన్ వద్దకు వెళ్లి నిలదీశారు. మద్యం సేవించానని, పొరపాటు జరిగిందని ఒప్పుకున్నాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని తెలిపాడు. స్థానికులు, వాహనదారులు ప్రకాశ్‌రావుకు వార్నింగ్ ఇచ్చి వదిలారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..