Warangal: అమ్మో..! యమడేంజర్ గ్యాంగ్.. టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్.. ఆరు రాష్ట్రాల్లో వరుసగా..

|

Sep 15, 2023 | 8:33 AM

అపార్ట్మెంట్లలో తాళంవేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని ప్రత్యేక యంత్రాలతో తాళాలు బ్రేక్ చేసి దోపిడీలకు బరి తెగించారు.. చోరీలు మాత్రమేకాదు.. కారులో క్లాస్ గా గంజాయి రవాణా చేస్తున్న ఆ నలుగురు సభ్యుల ముఠా వరంగల్ పోలీసుల చేతికి చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా పోలీసులు, వరంగల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠా పట్టుబడింది.. వీరి నుండి రెండు కోట్ల రూపాయల విలువగల సూమారు 2కిలో

అపార్ట్మెంట్లలో తాళంవేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని ప్రత్యేక యంత్రాలతో తాళాలు బ్రేక్ చేసి దోపిడీలకు బరి తెగించారు.. చోరీలు మాత్రమేకాదు.. కారులో క్లాస్ గా గంజాయి రవాణా చేస్తున్న ఆ నలుగురు సభ్యుల ముఠా వరంగల్ పోలీసుల చేతికి చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా పోలీసులు, వరంగల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠా పట్టుబడింది.. వీరి నుండి రెండు కోట్ల రూపాయల విలువగల సూమారు 2కిలో 380 గ్రాముల బంగారు, వజ్రాల అభరణాలు, ఐదు లక్షల 20 వేల రూపాయల విలువ గల 14కిలోల గంజాయితో పాటు ఒక పిస్టల్, ఐదు రౌండ్లు బుల్లెట్స్, ఒక కారు, నాలుగు సెల్‌‌పోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ అధార్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు చెందిన మహమ్మద్ అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ జాద్ ఖాన్ వున్నారు.. వీరంతా ఘజియాబాద్ కు చెందిన వారే.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 5వ తేదిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏడు అపార్ట్మెంట్లల్లో తాళంవేసి వున్న ఎనిమిది ఫ్లాట్స్‌లో చోరీలకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన వరంగల్ పోలీసులు.. నిందితుల కదలికలకు సంబందించి సిసి కెమెరా దృశ్యాల ఆధారంగా ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఓ టోల్ గేట్ వద్ద మాటు వేసి వీరిని పట్టేశారు. ఈ ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర ముఠా పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు వున్నాయి.. ఈ ముఠా పై వరంగల్ లో పీ. డీ యాక్ట్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..