Elephant: చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం.. దంపతులను తొక్కి చంపిన ఏనుగు.

|

Sep 01, 2023 | 10:12 PM

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలో ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్విగా గుర్తించారు. బస్వా పల్లికి చెందిన కార్తీ‌క్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఓ ఆవు దూడ కూడా మృతిచెందింది.

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలో ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు 190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్విగా గుర్తించారు. బస్వా పల్లికి చెందిన కార్తీ‌క్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఓ ఆవు దూడ కూడా మృతిచెందింది. ఈ ఘటనతో సమీప గ్రామస్తులు భయాందోళనతో వణికిపోతున్నారు. మరోవైపు స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..