Viral: ఆ డ్రైవర్ కు భూమి మీద ఇంకా నూకలున్నాయ్‌.. లేదంటే..? వీడియో వైరల్..

|

Oct 19, 2023 | 8:58 PM

ఎవరైనా ప్రమాదంనుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడితే అందరూ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయ్‌.. బ్రతికిపోయాడు అంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదుపుతప్పి లారీ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్‌ సేఫ్‌గా బయటపడ్డాడు. అతన్ని రక్షించిన స్థానికులు ఇతనికి ఎక్కడో నూకలు మిగిలే ఉన్నాయ్‌ అంటూ చర్చించుకున్నారు.

ఎవరైనా ప్రమాదంనుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడితే అందరూ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయ్‌.. బ్రతికిపోయాడు అంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదుపుతప్పి లారీ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్‌ సేఫ్‌గా బయటపడ్డాడు. అతన్ని రక్షించిన స్థానికులు ఇతనికి ఎక్కడో నూకలు మిగిలే ఉన్నాయ్‌ అంటూ చర్చించుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద టైల్స్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. అయితే డ్రైవర్‌ మాత్రం చాలా చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. లారీ బోల్తాకొట్టగానే పక్కకు పడిపోయిన అతన్ని స్థానికులు రక్షించారు. అక్కడ లారీ పరిస్థితి చూస్తే డ్రైవర్‌ బ్రతికే ఛాన్స్‌ లేదనుకుంటారు. కానీ అతను సేఫ్‌గా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి నంద్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..