Dog Viral Video: స్కూలునుంచి వచ్చిన చిన్నారిని రిసీవ్ చేసుకున్న కుక్క.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే కొన్ని వీడియోలు అంత హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి.
ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే కొన్ని వీడియోలు అంత హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి. అందుకే వాటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపైన ఒక ప్రదేశంలో ఓ స్కూలు బస్సు వచ్చి ఆగింది. ఇంతలో ఓ కుక్క అక్కడికి పరుగెత్తుకొచ్చి బస్సు ఎక్కే డోర్ దగ్గర నిలబడి అరుస్తుంది. ఇంతలో ఓ చిన్నారి బ్యాగ్ పట్టుకొని బస్సు దిగుతుంది. ఈ కుక్క ఆ చిన్నారి దగ్గర్నుంచి బ్యాగ్ అందుకొని తనని రిసీవ్ చేసుకుంది. ఆ చిన్నారి బస్సు దిగగానే డ్రైవర్‌కి బాయ్ చెప్పి బయలుదేరుతుంది. అది చూసి కుక్క కూడా నోటిలో బ్యాగ్‌తోనే ఆ డ్రైవర్‌కి బాయ్ చెప్పి చిన్నారిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఎంతో క్యూట్‌గా ఉన్న సన్నివేశాన్ని ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఆ కుక్క చేష్టలకు ముగ్ధులయిపోతున్నారు. “మా మంచి డాగ్” అంటూ ఆ కుక్కను తెగ మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ: