Viral: తండ్రి పాడెమోసి అంతిమసంస్కారాలు నిర్వహంచి రుణం తీర్చుకున్న కూతుళ్లు..
అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం మనసును మెలిపెడుతున్న మొక్కవోని ధైర్యంతో.. ఆ నలుగురుగా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఆకాల మరణం మనసును మెలిపెడుతున్న మొక్కవోని ధైర్యంతో.. ఆ నలుగురుగా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్ లో నరసింహారావు – గోపమ్మ దంపతులు నివాసముంటున్నారు. నరసింహరావు సింగరేణి విశ్రాంత ఉద్యోగి, వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు సంతానం. తనకు ఉన్నంతలో ఆరుగురు పిల్లలని ఉన్నత చదువులు చదివించాడు నరసింహరావు, రెండు సంవత్సరాల క్రితం ఈతకు వెళ్లి కుమారుడు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయాడు. అప్పటి నుండి ఆ ఇంటికి అన్నీ తామే అయి కూతుర్లే అమ్మానాన్నలను చూసుకుంటున్నారు. నరసింహారావు సోమవారం తెలవారుజామున గుండె నొప్పితో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు హాస్పటల్‌కి తరలించారు. చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే నరసింహ రావు మృతి చెందాడు. ఇంట్లో మగ వాళ్ళు ఎవరు లేకపోయే సరికి అన్ని తామై తమ తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించారు అయిదుగురు కూతుళ్లు. తండ్రి చివరి అంకంలో పెద్ద కూతురు తలకొరివి పెట్టగా మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోసి కన్నతండ్రి రుణం తీర్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

