Crane Falls: ఇదేం విడ్డురం..! కాల్వలో పడ్డ ట్రక్కు.. పైకి లాగబోయి కుప్పకూలిన క్రేన్..
ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కాల్వలో పడిన ట్రక్కును పైకిలాగబోయి క్రేన్ ఒక్కసారిగా అదే కాల్వలో కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కాల్వలో పడిన ట్రక్కును పైకిలాగబోయి క్రేన్ ఒక్కసారిగా అదే కాల్వలో కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. క్రేన్ కాల్వలో కుప్పకూలే సమయంలో క్యాబిన్ లో డ్రైవర్ ఉన్నాడు. కాల్వలో పడిన అతను ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.వంతెనపై నుంచి వైర్ల సహాయంతో రెండు క్రేన్లు ట్రక్కును లాగే ప్రయత్నం చేశాయి. కాల్వ నీటిలో ఉన్న వాహనాన్ని జాగ్రత్తగా పైకిలాగుతున్న క్రమంలో ఓ క్రేన్ వైర్లు తెగిపోయి. దీంతో బ్రిడ్జిపై నుంచి కాల్వల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో డ్రైవర్ ఉండిపోయాడు.. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..