Viral: కోనసీమలో కేరళ స్టైల్.. పెళ్లిలో కేరళ వాయిద్యాల హోరు.. వీడియో వైరల్..

|

Sep 07, 2023 | 10:07 PM

పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకేసారి జరిగే తంతును అందరూ అద్భుత జ్ఞాపకం, పది తరాలు చెప్పుకునేలా ఉండాలనుకుంటారు. అందుకోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రీతిలో ప్రత్యేకంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు.. పూర్వం పెళ్లిళ్లు అంటే పచ్చని కొబ్బరి ఆకులతో చలువ పందిళ్ళు, చుట్టూ మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల కాగితాలతో తయారు చేసిన రంగురంగుల బుట్టలు.

పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకేసారి జరిగే తంతును అందరూ అద్భుత జ్ఞాపకం, పది తరాలు చెప్పుకునేలా ఉండాలనుకుంటారు. అందుకోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రీతిలో ప్రత్యేకంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. కోనసీమ ప్రకృతి అందాలకు హరివిల్లు.. పూర్వం పెళ్లిళ్లు అంటే పచ్చని కొబ్బరి ఆకులతో చలువ పందిళ్ళు, చుట్టూ మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల కాగితాలతో తయారు చేసిన రంగురంగుల బుట్టలు. పెళ్లి ఇంట సందడి చేయడానికి మంగలి వాయిద్యాలు. నెల రోజులు ముందుగానే హంగామాలు. కానీ నేడు కోనసీమలో పెళ్లిళ్లు ట్రెండ్ మారిందనే చెప్పాలి. రాజుల కాలం నాటి పెళ్ళిలు పునర్ వైభవం నేడు పల్లెల్లో కానరావడం చూపర్లను ఆకట్టుకుంటుంది. రాజులు కాలం నాటి జోడు గుర్రాల రథంపై పెళ్లికూతురు,పెళ్లి కొడుకు ఊరేగుతూ ఉన్న రథం ముందు కేరళ వాయిద్యాల హోరు చుట్టూ బందువులు డాన్సులు జోరుతో బాణాసంచా పేలుళ్లు రోడ్డుపై ప్రయాణించే ప్రజలను రాజులు కాలం నాటి వైభవం కనులను తిప్పుకోకుండా చేస్తున్నదని చెప్పాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామంలో గోకవరపు వారి కళ్యాణ రిసెప్షన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రవీణ్ వెడ్స్ రమ్య రిసెప్షన్ వేడుకకు ఊరేగింపుగా రాజోలు నుండి చాకలి పాలెం కళ్యాణ మండపం వరకు కేరళ వాయిద్యాల హోరు నడుమ బంధువులు డాన్సులు జోరుతో రాజులు కాలం నాటి రథంపై పెండ్లి కొడుకు పెళ్లి కూతుర్లను ఊరేగుతూ రోడ్డుపై వెళ్తుంటే కనులు అర్పకుండా ఆశ్చర్య లోనైన చూపరులు. ఆనాటి రాజుల వైభవం నీటి గోకవరపు వారి పెళ్లి రిసెప్షన్ వేడుకలో కనిపించడం అందర్నీ అక్కటుకుంది. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విందు సుమారుగా 70 రకాలు వంట ఐటమ్స్ పెండ్లికి వచ్చిన భోజన ప్రియులను ఆకట్టుకున్నాయి. మరొకవైపు పెండ్లి కూతురు పెళ్లి కొడుకు తరుపు బంధువుల డాన్స్ ఈవెంట్లు, మిరిమిట్లు గోలిపే విద్యుత్ అలంకరణలు చూపరులను అలరించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..