Train Cost: ఒక్క రైలు బోగీకి అయ్యే ఖర్చు .. ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే..!

|

Jun 22, 2022 | 9:06 PM

ఆర్మీ రిక్రూట్‌మెంట్ కు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్' స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌, ఢిల్లీ,యూపీ, బీహార్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో యువత


ఆర్మీ రిక్రూట్‌మెంట్ కు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌, ఢిల్లీ,యూపీ, బీహార్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో యువత ఆందోళన చేస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో .. బీహార్‌లో పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు. మూడు రైళ్లకు నిప్పంటించగా మంటల్లో కొన్ని బోగీలు తగలబడ్డాయి. రైల్వే శాఖకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అయితే, ఆందోళనకారులు నిరసన తెలిపేందుకు నిప్పంటించే రైలు బోగీ తయారికీ ఎంత ఖర్చవుతుందో తెలుసా..? కోచ్ సౌకర్యాలను బట్టి వాటి ధర మారుతుంది. సాధారణ, స్లీపర్‌లతో పోలిస్తే AC కోచ్‌లు ఖరీదైనవి. ఇలా చూస్తే ఓ ఎక్స్ ప్రెస్ రైలు నిర్మాణానికి దాదాపు 68 కోట్లు ఖర్చవుతుంది. ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లు ఉంటాయి.. కాబట్టి ఒక్కో కోచ్‌కు 2 కోట్ల చొప్పున లెక్కగడితే దాని ఖరీదు 48 కోట్లు అవుతుంది. అదే సమయంలో దీని ఇంజన్ ధర 20 కోట్ల వరకు ఉంటుంది. ఇక సాధారణ ప్యాసింజర్ రైలు తయారీకి మొత్తం 50 నుండి 60 కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ రైళ్ల కోచ్‌లలో సౌకర్యాలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే కొంచెం తక్కువగా ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us on