Lift Accident: ఈ వీడియో చూశాక లిఫ్ట్ ఎక్కాలంటే భయపడతారు..! బటన్ నొక్కకుండానే వెళ్లిపోయిన లిఫ్ట్..
ఏదో ఒక సమయంలో ప్రతిఒక్కరూ లిఫ్ట్ ఎక్కే ఉంటారు. కొంతమంది ఆఫీసుల్లో, అపార్ట్‌మెంట్స్‌లో రోజూ లిఫ్ట్ ఎక్కుతూనే ఉంటారు. బహుళ అంతస్థుల భవనాలలో ఎవరైనా పైఅంతస్తులకు వెళ్లాలన్నా, దిగాలన్నా లిఫ్ట్ చాలా ముఖ్యం.
ఈ వీడియోలో ఒక రోగి, ఓ ఆస్పత్రి అటెండెంట్.. ఊహించని విధంగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. పేషెంట్ స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు. ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది అతన్ని లిఫ్ట్ ద్వారా మరో చోటికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే ఓ అటెండెంట్ లోపలికి వెళ్లాడు. బయట ఉన్న అటెండెంట్.. రోగి స్ట్రెచర్‌ను లోపలికి అడ్జెస్ట్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే లిఫ్ట్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. బటన్ నొక్కకుండానే.. లిఫ్ట్ కిందకు వెళ్లిపోయింది. స్ట్రెచర్ పూర్తిగా లోపలికి వెళ్లకుండానే లిఫ్ట్.. కిందకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న రోగి బంధువుతో పాటు ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో లిఫ్ట్ లోపల ఉండిపోయిన వారికి ఏమైనా గాయాలు అయ్యాయా అనే విషయంపై సమాచారం లేదు. కాగా ఈ వీడియో చూసిన జనం మాత్రం షాక్‌కు గురవుతున్నారు. సరైన మెయింటనెన్స్ లేకపోతే.. లిఫ్ట్స్ ద్వారా పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఈ ఘటన చెప్పకనే చెబుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
