Electrician: విద్యుత్ ఉద్యోగి సాహసం.. వరద నీటిలో ఈదుకుంటూ ప్రాణాలకు తెగించి మరీ..

|

Aug 06, 2023 | 9:45 AM

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే వరద నీటి మధ్యలోని ఓ స్తంభం వద్ద వైర్లు తెగిపోవడంతో కొత్తగూడ మండలానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో విద్యుత్ ఉద్యోగి శ్రీకాంత్ ప్రాణాలకు తెగించి వరదనీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తులు చేశాడు. దీంతో అంధకారంలో ఉన్న కొత్తగూడ గ్రామానికి కరెంట్ వచ్చింది.

కొందరు చేసే వృత్తిపట్ల ఎంతో అంకితభావం కలిగి ఉంటారు. అందుకే విధుల్లో ఎలాంటి అలసత్వ వహించకుండా వ్యవహరిస్తారు. ఇక్కడ ఓ విద్యుత్‌ శాఖలో పనిచేసే ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ ఆ గ్రామానికి విద్యుత్‌ సరఫరా అందించాడు. అదెలా అంటారా? భారీవర్షాలతో ఆ గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆ ఊరికి ఎలాగైన విద్యుత్ అందించాలని ఆ విద్యుత్ ఉద్యోగి చూపిన తెగువ, వృత్తిపట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే వరద నీటి మధ్యలోని ఓ స్తంభం వద్ద వైర్లు తెగిపోవడంతో కొత్తగూడ మండలానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో విద్యుత్ ఉద్యోగి శ్రీకాంత్ ప్రాణాలకు తెగించి వరదనీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తులు చేశాడు. దీంతో అంధకారంలో ఉన్న కొత్తగూడ గ్రామానికి కరెంట్ వచ్చింది. దీంతో విద్యుత్ ఉద్యోగి శ్రీకాంత్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షంలో విద్యుత్ స్థంబాలను ముట్టుకోకూడదని ప్రజలకు పలు సూచనలు చేసింది. కాగా వర్షాల వల్ల దెబ్బతిన్న కరెంట్ పోల్స్ ను, ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ తీగలను పునరుధ్దరించే పనిలో విద్యుత్ అధికారులు నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో కరెంట్ హెల్పర్ శ్రీకాంత్ ప్రాణాలకు తెగించాడు. భారీ వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి కరెంట్ తీగలను సరిచేసి గ్రామానికి కరెంట్ వచ్చేలా చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...