Elon Musk affair: స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడా..? టెస్లా బాస్ స్పందన ఇదీ..
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్‌కు ఎఫైర్ ఉందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ..
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్‌కు ఎఫైర్ ఉందని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని ఖండించారు. ఈ విషయంపై ట్వీట్ కూడా చేశారు. అందులో.. ” ఇది పూర్తిగా అబద్దం. సెర్జీ, నేను స్నేహితులం. గత రాత్రే మేమిద్దరం పార్టీలో కలిశాం. నేను అతని భార్య నికోల్‌ను మూడు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా గుంపుగా ఉన్నప్పుడు. ఈ వ్యవహారంలో మరో రకంగా అనుకోవడానికి ఏమి లేద’’ని ట్వీట్ చేశారు.గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. ఎలాన్ మస్క్ గతంలో మంచి స్నేహితులు. ఎంతలా అంటే ఎలాన్ మస్క్‌ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసేంత సాన్నిహిత్యం ఉంది. అలాంటిది సర్జీ, మస్క్‌కు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడని, వీటితో పాటు తన సలహాదారులకు కూడా మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడని తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా.. సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్‌హన్‌తో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్‌లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్‌కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..