భర్త ఆచూకీ లేదంటూ బోరున ఏడ్చిన భార్య.. చివరిలో సూపర్ ట్విస్ట్
భార్య చేతిలో మరో భర్త బలి... భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు ఇటీవల తరుచూ వినిపిస్తున్నాయి. ఘోరమైన ఘటనలు కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు.. కారణంగా మనుషులను క్రిమినల్స్‌గా మారుతున్నారు. బంధాలు, అనుబంధాలు మరిచి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి ఘటనలు పొరుగు రాష్ట్రాల్లో జరుగుతుంటే మనం వింతగా చెప్పుకున్నాం.. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఇది వ్యాపించింది.
తాజాగా ఇలాంటి ఘటననే కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించింది ఓ భార్య. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసలు.. ఇందులో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ అనే వ్యక్తి గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇతను జులై 29న రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవిని విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రమాదేవికి కిసాన్‌నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి, రాజయ్య, తన దూరపు బంధువైన ఖాదర్ గూడెంకు చెందిన కీసరి శ్రీనివాస్ లతో కలిసి సంపత్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం, రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, అక్కడ మద్యం తాగారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత, రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పింది. రమాదేవి ఆదేశాల మేరకు రాజయ్య, శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత, రమాదేవి తన భర్త కనిపించడంలేదంటూ బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. స్థానికులు, రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ముగ్గురూ కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారు. చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండె సమస్యలను క్షణాల్లో గుర్తించే ఏఐ టెక్నాలజీ
ట్రంప్ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు
పాదాలకు చెప్పులు, షూ లేకుండా వాకింగ్ చేయండి.. ఫలితాలు చూస్తే షాకవుతారు
అసలు వీరు పేరంట్సేనా..? కన్న కొడుకును ఎయిర్‌పోర్ట్‌లో వదిలి వెకేషన్‌కు..?