రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు వీడియో
తెలంగాణ ప్రభుత్వం జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయనుంది. దీని కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 101.83 కోట్లను కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకం ద్వారా చిన్న రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50% రాయితీ లభిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చేలా జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రేవంత్ సర్కార్ రూ. 101.83 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 60% వాటా భరించగా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా 50 శాతం రాయితీ పొందవచ్చు, ఇతర వర్గాల రైతులు 40 శాతం తగ్గింపుతో యంత్రాలు కొనుగోలు చేయవచ్చు. ఐదు ఎకరాల్లోపు పొలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు.
మరిన్ని వీడియోల కోసం :
