శభాష్ బేబీ.. ఇంటెలిజెంట్ అంటే నువ్వే! వీడియో చూసి కారు డోర్ ఓపెన్ చేసి
ఇటీవల తెలంగాణలో ఆశ్చర్యకరమైన గుండెను హత్తుకునే ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఒక చిన్న అమ్మాయి కారులో ఉండగా డోర్లు లాక్ పడ్డాయి. కారులో ఆరేళ్ల పాప ఒక్కతే చిక్కుకుపోయింది. తర్వాత ఏం జరిగిందో చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే, మరు క్షణంలోనే ఆ బాలిక తన తెలివితేటలను ఉపయోగించి లాక్ అయిన కారు నుండి సురక్షితంగా బయటపడింది. ఆమె ఈ ఘనతను మరెవరి సహాయంతో కాదు, యూట్యూబ్ వీడియో చూసి చేసింది. బాలిక కుటుంబం పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా హైవే పైన ఒక స్వీట్ షాప్ వద్ద ఆగినప్పుడు ఈ సంఘటన జరిగింది. కుటుంబం పాపను కారులోనే వదిలి, పొరపాటున కీస్ కూడా కారులోనే వదిలి బయటికొచ్చారు. పాప లోపల ఉండగానే డోర్లు లాక్ అయ్యాయి. సమయం గడిచేకొద్దీ కారు లోపల వేడి పెరిగి పాప పరిస్థితి దిగజారింది. ఇది చూసి, బయట నిలబడి ఉన్న బాలిక కుటుంబం, ఇతర వ్యక్తులు చాలా భయపడ్డారు. పాపను బయటకు తీసురావడానికి దాదాపు అరగంట పాటు ప్రయత్నించారు. అప్పుడో యువకుడు వచ్చి తన ఫోన్‌లో లాక్ అయిన కారును ఎలా తెరవాలో చూపించే యూట్యూబ్ వీడియోను ఓపెన్ చేశాడు. ఆ యువకుడు ఫోన్‌ను కిటికీపై ఉంచి, అందులో ఇచ్చిన సూచనలు పాటించమని పాపను కోరాడు. మీరు నమ్మరు, ఆ అమ్మాయి అన్ని సూచనలను బాగా అర్థం చేసుకుని లాక్ తెరిచింది. ఆ అమ్మాయి యూట్యూబ్ ట్యుటోరియల్ చూసి తనను తాను రక్షించుకుంది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు పాప ధైర్యాన్ని సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6 నెలలకే పుట్టిన చిన్నారి.. బతికించిన హైదరాబాద్ వైద్యులు
పెళ్లిలో డాన్స్ చేస్తున్న వరుడు.. చెప్పుతీసిన వధువు.. ట్విస్ట్ అదిరిందిగా
కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర
వాహనదారులకు అలర్ట్.. ఈ రహదారులపై ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లదు