వాగులో కొట్టుకుపోతున్న యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే

Updated on: Sep 20, 2025 | 2:08 PM

వారం రోజులుగా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో యాదాద్రి జిల్లాలోని మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీకి వరద పోటెత్తుతుండడంతో దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల లో-లెవెల్ బ్రిడ్జిలపై ఉదృతంగా నీరు ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

భారీవర్షాలు- వరదలతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్-భువనగిరి మండలాల మధ్య చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన వెలువర్తి మహేష్ చిన్నేటి వాగును దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉద్ధృతిని అతడు అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో లో లెవెల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో పట్టు కోల్పోయిన అతడు బ్రిడ్జిపై నుండి జారిపడి పోయాడు. అదృష్టవశాత్తు పిల్లర్ ను పట్టుకుని వేళాడుతూ ఉన్నాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీంతో తాడు సహాయంతో మహేష్ ను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాకపోవడంతో పోలీసులు చిన్నేటి వాగు వద్దకు జెసిబి ని రప్పించారు. జెసిబి సహాయంతో వాగులో చిక్కుకున్న మహేష్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మహేష్ ను రక్షించినందుకు జెసిబి డ్రైవర్ ను స్థానికులు అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాము తల కొరికి పక్కనే పెట్టుకొని నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు

Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం

ఫోన్ వద్దు.. పోదాం గ్రౌండ్‌కి అంటున్న కలెక్టర్! ఎక్కడంటే