మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
తెలంగాణలో కుక్కలు, కోతుల హత్యలపై జంతు ప్రేమికులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట నిరసన తెలిపారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో, మూగ జీవాలపై హింసను ఆపి, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి శాస్త్రీయ పరిష్కారాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ, జంతు సంరక్షణకు సరైన విధానాలు అవసరమని వారు స్పష్టం చేశారు.
తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడారు. ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు మూగజీవాలపై సరైన విధానం తీసుకోలేదని వారు వాపోయారు. తెలంగాణలో వందలాది కుక్కలు, కోతులను దారుణంగా చంపేస్తున్నారని వారు ఆరోపించారు. వెయ్యికిపైగా కుక్కలు, వందకుపైగా కోతులను దారుణంగా హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవీయ విలువల క్షీణతకు నిదర్శనమని విమర్శించారు. హత్యలు చేయడం కాదు.. శాస్త్రీయ పరిష్కారాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, నివాస రక్షణే సరైన మార్గమని స్పష్టం చేశారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు మూగజీవులపై హింస కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సమాజాన్ని నైతికంగా వెనక్కి నెట్టేస్తాయని… వెంటనే జంతువుల హత్యలు నిలిపివేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bangladesh: మొండికేసిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్! వరల్డ్ కప్ నుంచి అవుట్
కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం
తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే
Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం
