సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్

|

Jan 25, 2024 | 9:46 PM

ఖమ్మం జిల్లాలో ఓ టీచర్‌ వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులకు అర్థం కావడమే కాదు.. వారు మర్చిపోకుండా ఉండేందుకు పాటల రూపంలో పాఠాలు బోధిస్తున్నారు టీచర్‌ తేరాల సాధన. ఖమ్మం లోని షైన్ ఇండియా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న సాధన... పేరడీ పాటలు రాసి రాగయుక్తంగా ఆలపిస్తూ పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు. భారతదేశం చిత్ర పటంలోని సరిహద్దులను సులభంగా గుర్తు పట్టేందుకు ఓ సినిమా లోని పాటకు పేరడీగా 'దాని కుడిభుజమ్మీద పాకిస్థాన్..

ఖమ్మం జిల్లాలో ఓ టీచర్‌ వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులకు అర్థం కావడమే కాదు.. వారు మర్చిపోకుండా ఉండేందుకు పాటల రూపంలో పాఠాలు బోధిస్తున్నారు టీచర్‌ తేరాల సాధన. ఖమ్మం లోని షైన్ ఇండియా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న సాధన… పేరడీ పాటలు రాసి రాగయుక్తంగా ఆలపిస్తూ పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు. భారతదేశం చిత్ర పటంలోని సరిహద్దులను సులభంగా గుర్తు పట్టేందుకు ఓ సినిమా లోని పాటకు పేరడీగా ‘దాని కుడిభుజమ్మీద పాకిస్థాన్.. దాని పైనే ఉంది అఫ్ఘనిస్తాన్.. దాని ఎడం భుజమ్మీద నేపాల్.. దాని పైనే ఉంది చైనా’ అంటూ చిన్నారులకు గుర్తుండేలా బోధిస్తున్నారు. దీంతో పిల్లలు సులభంగా గుర్తుంచుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఈ పేరడీ పాటలను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా కోటి మంది వీక్షించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సైతం ఈ వీడియోను గ్రూపుల్లో షేర్ చేశారు. పిల్లలను ఆకట్టుకునేలా బోధన చేస్తున్న సాధనకు 2023లో తెలంగాణ ఆల్ టీచర్స్ ప్రైవేటు అసోసియేషన్, వరంగల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?

చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??

భారీ డేటా లీక్‌.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన

విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆటలాడిన కొండముచ్చు

Aadhaar Cards: నీట్లో కొట్టుకొస్తున్న ఆధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ సీరియస్

Follow us on