మనుషుల సమాధుల మధ్య రెస్టారెంట్.. అవే నా అదృష్టం అంటున్న ఓనర్
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం లాల్‌దర్వాజా ప్రాంతంలో ఉన్న లక్కీ రెస్టారెంటు చాయ్, మస్కా బన్నుకు ఫేమస్. స్థానికులతోపాటు చాలామంది ప్రముఖులు ఈ రెస్టారెంటుకు వస్తుంటారు. గతంలో ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇక్కడి టీ రుచి చూశారు. కేవలం చాయ్ తాగి ఊరుకోలేదు ఆ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు.
అప్పటికప్పుడు ఓ పెయింటింగ్ వేసి.. ఆ రెస్టారెంట్ యజమాని మహమ్మద్ భాయ్‌కు బహుకరించారు. నేటికీ ఆ ఒరిజినల్ పెయింటింగ్ రెస్టారెంట్ గోడలపై కనిపిస్తూ.. కళా ప్రియులను అలరిస్తూనే ఉంది. ఇంతకూ ఈ రెస్టారెంట్ ఇంత ఫేమస్ కావటానికి కారణం.. అక్కడ దొరికే చాయో, రోజూ భారీగా వచ్చే జనం మాత్రమే కాదు.అది 26 సమాధులు, రెండు చెట్ల మధ్య ఉండటం కూడా. రోజూ అక్కడి సిబ్బంది అన్ని సమాధులపై పూలు చల్లి, ఫాతెహా చదువుతారు. మహమ్మద్ భాయ్ 1960లో ఆ శ్మశానవాటికలో చాయ్ బండిని నడిపేవాడు. క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడంతో ఇదే ప్రాంతంలో 400 ఏళ్లకు పైగా ఉన్న సమాధుల మధ్య రెస్టారెంట్ నెలకొల్పాలని అతనికి ఆలోచన వచ్చింది. అలా రెస్టారెంట్ ను శ్మశానవాటిక లోపల నిర్మించారు. సమాధుల కారణంగా అదృష్టం కలిసొచ్చిందని రెస్టారెంట్‌కు లక్కీ అని పేరు పెట్టుకున్నారు. ఆదివారం ఎక్కువ రద్దీ ఉంటుందని, ఈ రెస్టారెంటు హిందూ, ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని వినియోగదారు ఫరీద్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్.. ఏకంగా
డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు
భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!