వరుసగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే ??

|

Jun 13, 2023 | 8:47 PM

ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండడం ఉన్నత స్థాయిలోని అధికారులను కలవరపెడుతోంది. మిగతా కారణాలు కూడా ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ‘వర్క్ ఫ్రం హోం’ ఎత్తేయాలన్న

ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండడం ఉన్నత స్థాయిలోని అధికారులను కలవరపెడుతోంది. మిగతా కారణాలు కూడా ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ‘వర్క్ ఫ్రం హోం’ ఎత్తేయాలన్న నిర్ణయమేనని ఉద్యోగులు అంటున్నారు. కరోనా కాలంలో అమలు చేసిన వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో కాస్త వెసులుబాటు దొరుకుతోందని, మళ్లీ ఆఫీసులకు రమ్మనడంతో ఆ వెసులుబాటును వదులుకోలేక రాజీనామాలకు సిద్ధపడుతున్నారని భావిస్తున్నారు. పురుషులతో పాటు మహిళలకూ సమానంగా అవకాశాలు ఉంటాయని, వివక్ష ఉండదని టీసీఎస్ సంస్థపై ఉద్యోగుల అభిప్రాయం. కరోనా లాక్ డౌన్ తర్వాత ఐటీ కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. ఆమేరకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకునేందుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాయి. ఈ వెసులుబాటుతో ట్రాఫిక్ కష్టాలకు, హడావుడి జీవితానికి స్వస్తి పలికిన ఉద్యోగులు.. ఇదే తమకు కంఫర్ట్ గా ఉందని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ‘ప్రేమలో ఉన్నా..’ ఒప్పేసుకున్న తమన్నా| అక్షరాలా రూ. 486కోట్లు ఇది ఏ హీరో వల్ల కాదు

Digital TOP 9 NEWS: గుజరాత్‌కు పెద్ద గండం | దేశంలోనే పెద్ద ఆస్పత్రి ఇక్కడే

Follow us on