ఆలయంలో వింత ఆచారం.. భక్తులకు ఉచితంగా డబ్బులు పంపిణీ
సాధారణంగా ఆలయాల్లో భక్తులు హుండీలో డబ్బులు వేయడం ఆనవాయితీ. కానీ తమిళనాడులోని కరప్పుసామి ఆలయంలో మాత్రం భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. పైగా దేవుడి ఆశీర్వాదంగా నాణేలను ప్రసాదంగా పంచుతారు. ‘పిడి కాసు’గా పిలిచే ఈ వింత ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుళ్లోకి వెళ్తే హుండీలో కానుకలు వేయడం మనకు తెలిసిన ఆనవాయితీ. కానీ, ఆ గుడికి వెళ్తే మీరు ఒక్క పైసా కూడా సమర్పించుకోనక్కర్లేదు.. పైగా వారే మీకు డబ్బులను ప్రసాదంగా పంచుతారు. అదీ మామూలుగా కాదు.. దేవుడి పూనకంతో ఉన్న ఓ భక్తుడు పదునైన కత్తిపై నడుస్తూ, సిగరెట్ తాగుతూ ఆ ప్రసాదాన్ని పంచుతారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగే ఈ అరుదైన ఉత్సవానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. కడలూరు జిల్లా వినాయకపురంలోని కరప్పుసామి ఆలయంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఆలయంలో కొలువైన కరప్పుసామికి ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా పూజలు నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి తరలివస్తారు. ఆలయంలో భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు, కానుకలు స్వీకరించరు. దానికి బదులుగా దేవుడి ఆశీర్వాదంగా నాణేలను ఓ భక్తుడి చేతుల మీదుగా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. అదే సమయంలో అతను సిగరెట్ కాలుస్తుంటాడు. దీనిని స్థానికంగా ‘పిడి కాసు’ అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా దేవుడి వేషధారణలో పూనకంలో ఉన్న ఓ భక్తుడు పదునైన కత్తిపై నడుస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తాడు. దేవుడే స్వయంగా ఇచ్చినట్లుగా భావించి నాణేలను ప్రసాదంగా తీసుకుంటే.. సిరిసంపదలు వృద్ధి చెందుతాయని, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న చాలా ఆలయాల్లో డబ్బులకే ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలున్నాయి. అందుకు భిన్నంగా కరుప్పస్వామి ఆలయ సంప్రదాయం ఆకట్టుకుంటోంది. భక్తుల నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా, తిరిగి వారికే డబ్బులను ప్రసాదంగా ఇస్తూ భక్తి, సంప్రదాయాలకు పెద్దపీట వేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘కమర్షియలైజేషన్ లేని అసలైన ఆధ్యాత్మికత అంటే ఇదే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారం నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోస్ట్ చూడగానే వ్యూస్ వస్తాయనుకుంటే.. పోలీసులొచ్చారు
తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన
మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే..? శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
జస్ట్ 30 నిమిషాల్లో.. 12 కి.మీ జర్నీ హైదరాబాద్ స్పీడ్‌కు బెంగళూరు టెకీ ఫిదా..
ఏడాదికి 50 లక్షల జీతం.. 10 వేల ఫోన్.. ఆటోలో ఆఫీసుకు.. ఈ ఐటీ ఉద్యోగిని కథ వైరల్