తండ్రి లక్షల పెన్షన్ కోసం.. కూతురు ఏం చేసిందో తెలుసా ??

|

May 16, 2024 | 12:53 PM

తండ్రికి వచ్చే పెన్షన్‌ కోసం తైవాన్‌లో ఓ మహిళ చేసిన అమానవీయ చర్య విస్తుపోయేలా ఉంది. ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు. హోదా, సర్వీసు బట్టి ఆయనకు నెలకు దాదాపు రూ.1.27 లక్షల పెన్షన్‌ వస్తుందని అంచనా. కొన్నేళ్లుగా పింఛను విత్‌డ్రా చేస్తున్నప్పటికీ.. ఆ వృద్ధుడు మాత్రం కనిపించ లేదు. ఇదే సమయంలో కుమార్తె తీరు..

తండ్రికి వచ్చే పెన్షన్‌ కోసం తైవాన్‌లో ఓ మహిళ చేసిన అమానవీయ చర్య విస్తుపోయేలా ఉంది. ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు. హోదా, సర్వీసు బట్టి ఆయనకు నెలకు దాదాపు రూ.1.27 లక్షల పెన్షన్‌ వస్తుందని అంచనా. కొన్నేళ్లుగా పింఛను విత్‌డ్రా చేస్తున్నప్పటికీ.. ఆ వృద్ధుడు మాత్రం కనిపించ లేదు. ఇదే సమయంలో కుమార్తె తీరు.. అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది. ముఖ్యంగా డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందిని ఆమె లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమెకు సుమారు లక్షన్నర రూపాయల జరిమానా విధించారు. ఇలా మరోసారి కూడా ప్రభుత్వ అధికారులను ఇంట్లోకి రానివ్వకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆమె తండ్రి ఎక్కడ అని ఆరా తీయగా.. నర్సింగ్‌ హోమ్‌లో ఉన్నట్లు ముందు బుకాయించింది. మరిన్ని ప్రశ్నలు వేసేసరికి మరో కట్టుకథ అల్లింది. వేరే నగరంలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నాడని తెలిపింది. పోలీసుల విచారణలో.. ఆమె సోదరుడు చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు తేలింది. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా.. తండ్రి చనిపోయాడని, మరణ ధ్రువీకరణ పత్రం పొందలేదని తెలిపింది. ఇలా అనేక కథలు చెబుతుండటంతో పోలీసులు.. చివరకు ఆమె ఇంట్లో సోదాలు జరిపేసరికి అసలు విషయం బయటపడింది. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో మానవ ఎముకలు గుర్తించారు. దర్యాప్తు చేసిన అధికారులు.. రెండేళ్ల క్రితమే ఆయన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, వృద్ధుడి మరణానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. కుమార్తెనే చంపిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి రావాల్సిన పింఛన్‌ మాత్రం క్రమంగా విత్‌డ్రా అవుతున్నట్లు గుర్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ధనుష్ ఒక గే’.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు

దేవర డేట్‌పై కన్నేసిన చెర్రీ.. అంటే పోరు తప్పదన్నట్టే..!

Upasana Konidela: మా ఆయన వల్లే డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్ !!

Follow us on