తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Updated on: Apr 07, 2026 | 8:51 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారి మోసం బయటపడింది. తహసీల్దార్‌ అన్వర్ హుస్సేన్‌ను బెదిరించి రూ. 50 లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు. అవినీతి చిట్టా ఉందంటూ మూడేళ్లుగా టోకరా వేసిన ఈ మోసం, నిజమైన ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడి హనుమంతును అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు.

అవినీతి అధికారుల భయమే పెట్టుబడిగా ఓ కేటుగాడు ఏకంగా తహసిల్దార్‌నే బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు వసూలు చేశాడు. తాను ఏసీబీ అధికారినని నమ్మించి మూడేళ్లపాటు సాగించిన ఈ మోసం, అసలు అధికారులు రంగంలోకి దిగడంతో బట్టబయలైంది. శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్ గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్ కు 2021 సంవత్సరంలో ఫోన్ కాల్ వచ్చింది.అవతలి వ్యక్తి తనను తాను ఏసీబీ సీఐ హరినాథ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో..నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది.. త్వరలోనే నీ ఇల్లు, ఆఫీసుపై దాడులు చేస్తాం అంటూ బెదిరించాడు. ఏసీబీ అనగానే భయపడిన ఆ తహసిల్దార్ దాడులు జరగకుండా ఉండేందుకు దఫదఫాలుగా సుమారు రూ. 50 లక్షలు ఆ నకిలీ అధికారికి ముట్టజెప్పాడు. కట్ చేస్తే.. ఒకరోజు నిజమైన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయడంతో అన్వర్ హుస్సేన్ విస్తుపోయాడు. అప్పటివరకు తాను డబ్బులు ఇచ్చింది అసలు అధికారికి కాదని, ఒక 420 గాడికి అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ పాత కేసుపై తాజాగా సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టి సారించడంతో విచారణ వేగవంతమైంది. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. అవినీతి అధికారుల భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్న నకిలీ అధికారుల మోసం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Follow Us