బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

Updated on: Dec 26, 2025 | 5:20 PM

స్విగ్గీ విడుదల చేసిన 2025 ఆన్‌లైన్‌ ఆర్డర్‌ రిపోర్ట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. స్విగ్గీ ఆర్డర్లలో ఎక్కువగా బిర్యానీలే ఉన్నాయి. 2025 మొత్తం 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదు చేసింది. అంటే నిమిషానికి 194 బిర్యానీలు ఆర్డర్‌ అయినట్లే. వీటిలో చికెన్‌ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో టాప్‌లో నిలిచింది. బిర్యానీ తర్వాత బర్గర్లు , ఆ తర్వాత పిజ్జాలు, తర్వాత దోశలు ఎక్కువగా ఆర్డర్‌ అయిన ఆహారపదార్థాలుగా ఉన్నాయి. లంచ్‌ కంటే డిన్నర్‌కే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. విదేశీ వంటకాల్లో మెక్సికన్‌ , టిబెటన్‌, కొరియన్‌ ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయట.

స్విగ్గీ స్పీడ్‌ డెలివరీ కొనుగోళ్లలో విజయవాడ దూసుకుపోయింది. విజయవాడ ప్రజల్లో వస్తున్న ఆర్థిక మార్పులకు, జీవనశైలికి ఈ కొనుగోళ్లు అద్దం పడుతున్నాయని స్విగ్గీ రిపోర్ట్‌ వివరించింది. 2025లో విజయవాడలో ఒక వ్యక్తి రూ. 3.62 లక్షలకు సరుకులు ఆర్డర్‌ పెట్టారట. ప్రతి రోజు ఏడాది పొడవునా అంత ఖర్చు చేశారట. హైదరాబాద్‌లో ఒక వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.3 లక్షలు కొనడం దేశంలోనే అత్యధికంగా నిలిచింది. అయితే ఆ వినియోగదారుడు మూడు ఐ ఫోన్లను కొనడంతో అంత ఖర్చు అయింది. విజయవాడలో మరో ముగ్గురు కొనుగోలుదారులు ఏడాదిలో రూ. 3 లక్షలకుపైగా కొనుగోలు చేశారని ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో