Golden River: మీకు తెలుసా.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది !!

|

Nov 28, 2022 | 8:48 PM

మన దేశం జీవ నదులకు పుట్టినిల్లు. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత.. ఈ నదులపైనే కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. మత్స్యకారులకైతే ప్రధాన ఉపాధి నదులే అని చెప్పవచ్చు.

మన దేశం జీవ నదులకు పుట్టినిల్లు. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత.. ఈ నదులపైనే కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. మత్స్యకారులకైతే ప్రధాన ఉపాధి నదులే అని చెప్పవచ్చు. వీరు నదులలో, సముద్రాల్లో చేపలు పట్టి జీవనం సాగిస్తారు. అయితే మనదేశంలోని ఓ నది మాత్రం చాలా భిన్నమైనది.. ఎందుకంటే ఈ నది కేవలం సాగునీరు, చేపలను మాత్రమే కాదు బంగారాన్ని కూడా మోసుకొస్తోంది. ఏన్నో ఏళ్లుగా ఈ నది తీసుకొచ్చే బంగారంతో జీవనం సాగిస్తున్నారు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ నది జీవరాసుల నిలయం మాత్రమే కాదు బంగారాన్ని మోసుకొచ్చే బంగారు నది. ఈ నది పేరు సుబర్ణరేఖ నది. దీనినే స్వర్ణరేఖ అని కూడా పిలుస్తారు. ఝార్ఖండ్‌‌లోని రత్నగర్భ ప్రాంతంలో ప్రారంభమైన ఈ నది పశ్చిమబెంగల్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ప్రవహిస్తుంది. స్వర్ణరేఖ అంటే బంగారు గీత అని అర్ధం. పేరులో ఉన్నట్లుగానే.. ఈ నదిలో బంగారం లభిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లాటరీ సొమ్ముతో.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో భార్య జంప్ !!

Published on: Nov 28, 2022 08:48 PM