అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు వీడియో

Updated on: Oct 04, 2025 | 4:04 PM

సూర్యాపేట జిల్లాలో దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి పిండి వంటలు ఇచ్చి తిరిగి వస్తున్న ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపికైన నాగరాజు, అతని తమ్ముడు కార్తీక్ మృతి చెందడంతో పేద కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి పిండి వంటలు ఇచ్చి తిరిగి వస్తున్న ఇద్దరు అన్నదమ్ములు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని, గ్రామస్థులను శోకసంద్రంలో ముంచేసింది. తిరుమలగిరి మండలం మాలీపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు ఆరు నెలల కిందటే పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబానికి చెందిన నాగరాజు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. నాగరాజు తమ్ముడు కార్తీక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో