మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్‌

|

Mar 23, 2024 | 7:28 PM

వియత్నాంలో అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి పేగుల్లోకి ఓ చేప చొరబడింది. అది పేగుల్లో సజీవంగా ఉండటమే కాకుండా పేగులకు చిల్లులు పెట్టి పడేసింది. కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు షాక్‌ తిన్నారు. వెంటనే ఆపరేషన్‌ చేసి అతన్ని ప్రమాదం నుంచి కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్వాంగ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు.

వియత్నాంలో అసాధారణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి పేగుల్లోకి ఓ చేప చొరబడింది. అది పేగుల్లో సజీవంగా ఉండటమే కాకుండా పేగులకు చిల్లులు పెట్టి పడేసింది. కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లిన బాధితుడిని పరీక్షించిన వైద్యులు షాక్‌ తిన్నారు. వెంటనే ఆపరేషన్‌ చేసి అతన్ని ప్రమాదం నుంచి కాపాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్వాంగ్ ప్రావిన్స్‌లోని హాయ్‌హా జిల్లాకు చెందిన 34 ఏళ్ల బాధితుడు ఇటీవల కడుపునొప్పితో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కోలాన్‌ అంటే పెద్ద పేగు చివరి భాగంలో సజీవంగా ఉన్న 30 సెంటీమీటర్ల ఈల్ చేపను చూసి షాకయ్యారు. అతడి పేగులకు అది చిల్లులు పెట్టడం కూడా గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములకు ఆవాసమైన పురీషనాళం పక్కనే కోలాన్ ఉండటంతో ఆపరేషన్ సందర్భంగా ఇన్ఫెక్షన్ తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముఖేష్‌ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్‌ ఏంటో తెలుసా ??

కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని

అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు

మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??

Published on: Mar 23, 2024 07:27 PM