కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

Updated on: Jul 14, 2025 | 7:19 PM

మనలో చాలామందికి జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఇంట్లో భాగంగా భావిస్తూ, ప్రేమతో పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కుక్కలను ఇంట్లో పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకూ ప్రతీ ఒక్కరూ వివిధ రకాల శునకాలను తమ ఇంటికి తీసుకువస్తున్నారు.

కొందరికి అవి స్టేటస్ సింబల్ అయితే, మరికొందరు తమ రక్షణ కోసం పెంచుకుంటున్నారు. అయితే పెంపుడు జంతువులపై ఈ ఆసక్తికి తాజాగా గట్టి ఆంక్షలు ఎదురవుతున్నాయి. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో శునకాన్ని పెంచుకోవాలంటే కనీసం పది మంది ఇరుగు పొరుగువారిచే నిరభ్యంతర పత్రం.. NOCని సమర్పించడం తప్పనిసరి అని కార్పొరేషన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అపార్ట్‌మెంట్లలో శునకాలను పెంచాలంటే సొసైటీ ఛైర్‌పర్సన్, కార్యదర్శుల అనుమతి అవసరమని స్పష్టం చేసింది. ఇది శునకాల కారణంగా కలిగే అసౌకర్యాలను నివారించడం కోసం తీసుకున్న చర్య అని అధికారులు తెలిపారు. మే నెలలో కుక్క దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ

బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం