Patanjali: కేంద్రం కళ్లు మూసుకుందా.? పతంజలి ప్రకటనలపై సుప్రీం ఆగ్రహం.!

|

Feb 29, 2024 | 4:41 PM

తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక జాప్యం వద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది.

తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక జాప్యం వద్దని.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ‌కు గతంలోనే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. తమ ఉత్ప‌త్తుల వ‌ల్ల కొన్ని వ్యాధులు న‌యం అవుతాయంటూ ప‌తంజ‌లి కంపెనీ కొన్ని ప్రక‌ట‌నలు ఇస్తూ వచ్చింది. ఈ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐఎంఏ కిందటి ఏడాది కోర్టులో కేసు వేసింది. ఆ ప్రకటనలు డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ పేర్కొంది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ‌ ఉత్పత్తుల‌ను, ఆ ఉత్ప‌త్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలి ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని చూడాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on